Amaravati, March 26: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ ఉధృతి దడ పుట్టిస్తుంది, ఒక్కసారిగా కేసులు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోజూవారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువైంది. గడిచిన కొన్ని నెలల్లో ఇదే అత్యధికం. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల నుంచే ఉంటున్నాయి. మిగతా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,604 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,96,863 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,93,968గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 176 కోవిడ్ కేసులు నమోదు కాగా, విశాఖపట్నం నుంచి నుంచి కూడా అదే స్థాయిలో 170 కేసులు, చిత్తూరు నుంచి 163, కృష్ణా నుంచి 110 మరియు నెల్లూరు జిల్లా నుంచి 89 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,203కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 306 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,85,515 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 4,145 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.