కోనసీమ జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబుతో టీడీపీ నేతలు పంటు దిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబును తొలుత భద్రత సిబ్బంది పంటు నుంచి నాటు పడవ ఎక్కించారు. వేరొక నాటు పడవ ఎక్కేందుకు ర్యాంపు మీదకి నేతలంతా రావటంతో ఒక్కసారిగా తెగి గోదావరిలో పడిపోయింది. బరువు కారణంగా పంటు ముందు భాగం రెక్క తెగింది. మాజీ మంత్రులు దేవినేని ఉమా , పితాని సత్యనారాయణ , ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే రామరాజు , నేతలు కలవపూడి శివ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు.
వెంటనే లైఫ్ జాకెట్లు వేసి వారిని సిబ్బంది కాపాడారు. అయితే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది.
Here's Video
Major tragedy averted! TDP leaders fall into the water of River Godavari as a boat overturned during the survey. All were rescued safely. Former CM and party chief #ChandrababuNaidu is on a two-day visit to flood-hit areas of #AndhraPradesh.#AndhraPradeshfloods pic.twitter.com/lFsfsz8fj9
— Ashish (@KP_Aashish) July 21, 2022
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు గారి పర్యటన కొనసాగుతోంది. అయోధ్యలంకలో బాధిత ప్రజలను రైతులను కలుసుకునేందుకు భీకరంగా ఉన్న వశిష్ట గోదావరిని పంటు సాయంతో దాటుతున్నారు ఈ వయసులో ప్రజల కోసం @ncbn గారు చేస్తున్న సాహసాన్ని చూసి 'దట్ ఈజ్ బాబు' అంటున్నారు రాష్ట్ర ప్రజలు#APHopeCBN pic.twitter.com/05GEP7bZrS
— Veluri Sathish (@VeluriSathish2) July 21, 2022
అధికారులు చెప్పినా టీడీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. లైఫ్ జాకెట్లు లేకుండా బోటులో ప్రయాణించారు. చంద్రబాబుతో సహా సేఫ్టీ చర్యలను టీడీపీ నేతలు పాటించలేదని సమాచారం. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ,రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడిపోయారు.