Prakasam Shocker: అనుమానం..బ్లేడు, కత్తిపీటతో భార్య గొంతు కోసి చంపేసిన భర్త, ప్రకాశం జిల్లాలో దారుణం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గిద్దలూరు పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Prakasam, May 1: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు (Prakasam Shocker) చేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామంలో భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను హత్య ( husband killed his wife on suspicion) చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొనకనమిట్ల మండలం గార్లదిన్నెకు చెందిన దూదేకుల బాజీతో బేస్తవారిపేట మండలం అక్కపల్లెకు చెందిన ఖాజీబీ(26)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి బాజీ నిత్యం అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో ఆమె అమ్మగారింటికి వెళ్లిపోయింది. అయితే పెద్దలు సర్ది చెప్పి మూడేళ్ల క్రితం మళ్లీ ఆమెను అత్తగారింటికి పంపారు.

కాగా మామతో పాటు బాజీ బేల్దారి పనులు చేసుకుంటూ ఉండగా.. గొడవలు జరగడంతో రెండేళ్లుగా దంపతులు గలిజేరుగుళ్లలో కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడేళ్ల కొడుకును బయట పడుకోబెట్టి దంపతులు మళ్లీ ఇంట్లో గొడవపడ్డారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో భర్త కత్తిపీట, బ్లేడ్‌తో భార్య గొంతు కోసి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత బయట తలుపునకు తాళం వేసుకుని అక్కడి నుంచి పరారై పీవీపురం చేరాడు.

అక్కడ భవన నిర్మాణం చేస్తున్న యజమాని ఆవుల కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి గలిజేరుగుళ్లలో పెద్ద గొడవ జరిగిందని, గ్రామస్తులు తనను కొట్టి తరుముకున్నారని, తమ బంధువులు ఉన్న బసినేపల్లెలో మోటార్‌ సైకిల్‌పై తనను వదిలి పెట్టాలని ఆయన్ని కోరాడు. అక్కడ వదిలి పెట్టిన తర్వాత అనుమానంతో అక్కపల్లె వెళ్లి ఖాజాబీ తండ్రి పులిమద్ది సుబ్బయ్యకు జరిగిన విషయాన్ని ఆయన తెలిపాడు.

కూతుర్నే ప్రేమిస్తావా..యువకుడి కాళ్లు చేతులు నరికేసిన ప్రియురాలి బంధువులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ప్రియుడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన

కుమార్తెకు, అల్లుడికి ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో సుబ్బయ్య తన బంధువులతో కలిసి గలిజేరుగుళ్ల వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా గొంతుతెగి రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహం కనిపించింది.

అనంతరం ఆయన పోలీసులకు సమాచారం అందించారు. గిద్దలూరు ఎస్‌ఐ సుధాకరరావు, ఎస్‌ఐ బాలకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.