Chennai, July 3: ఏపీలో గతనెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో సూట్ కేసులో మృతదేహం కేసును ఛేదించినట్లు తిరుపతి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ సుప్రజ(అడ్మిన్) తెలిపారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి.. హత్యకు ఉపయోగించిన దిండును, జత కమ్మలు, తాలిబొట్టు, లక్ష్మీకాసులను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 2వ తేదీన ఉదయం తిరుపతి జూపార్కు రోడ్డులోని సైన్స్ సెంటర్ వద్ద పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు విచారించారు.
అతను కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి (30)గా గుర్తించారు. అతనిపై చీటింగ్ కేసు ఉన్నట్లు తెలుసుకుని ఆరా తీశారు. లోకసత్తా పార్టీ సభ్యుడుగా ఉంటూ పీపుల్స్ అగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థను మొదలు పెట్టి సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ గుర్తింపుతో రామసముద్రం మండలం రాగిమాకులపల్లెకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీరు భువనేశ్వరితో ఫేస్‌బుక్ పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమగా మారడంతో 2018 జనవరిలో వారు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వారికి ఏడాదిన్నర పాప కరుణశ్రీ ఉంది. 2021 మార్చిలో హైదరాబాద్ నుంచి తిరుపతికి నివాసం మార్చారు. అతను చెడు వ్యసనాలకు అలవాటుపడి భార్య సంపాదనపై బతుకుతూ.. వరకట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
జూన్ 21న తేదీ రాత్రి జరిగిన గొడవలో (Man Kills Wife After Heated Argument) భార్య గొంతు నులుముతూ.. తలదిండుతో ఆమె ముఖంపై అదిమి చంపేశాడు. ఎవరికి అనుమానం రాకుండా సూట్‌కేసు కొని అందులో మృతదేహాన్ని ఉంచి.. కూతురిని ఎత్తుకుని అద్దె కారులో జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రుయా ఆస్పత్రి వద్దకు వెళ్లారు. కారును వెనక్కు పంపి సూట్‌కేసుపై పెట్రోల్ పోసి నిప్పటించినట్లు (Her Body in Suitcase and Sets It Ablaze) నిందితుడు అంగీకరించాడు. భువనేశ్వరి గురించి బంధువులు అడిగినప్పుడు డెల్టా ప్లస్ కొవిడ్‌తో మృతి చెందిందని.. మృతదేహం కూడా ఇవ్వలేదని చెప్పాడు.
Here's tirupatipolice Tweet
ఇటీవల సంచలనం సృష్టించిన సూట్‌కేస్ హత్య కేసును చేధించిన తిరుపతి అర్బన జిల్లా అలిపిరి పోలీసులు
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్. ఇందులో ముద్దాయిని పట్టుకొనుటకు సహకరించిన సిబ్బందిని యస్.పి గారు శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు అభినందించి రివార్డును ప్రకటించినారు.@APPOLICE100 pic.twitter.com/odn4EE1GD2
— tirupatipolice (@tirupatipolice) July 2, 2021
కూతురిని భువనేశ్వరి బంధువులకు అప్పగించి ఇంటికి తాళం వేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. కేసులో వారి అక్క కుమార్తె పీఎస్‌ఐ మమత వెల్లడించిన వివరాలు కేసు ఛేదనకు ఉపయోగపడ్డాయి. కేసు ఛేదించిన తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ జయచంద్ర, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్, నాగార్జున, లక్ష్మణరావులను అభినందించారు.