Andhra Pradesh Shocker: మిద్దె మీదకు తీసుకువెళ్లి.. ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు (Andhra Pradesh Shocker) అత్యాచారానికి పాల్పడ్డాడు. మిద్దె మీదకు తీసుకువెళ్లి కామాంధుడు ఇద్దరు చిన్నారులపై ఈ అఘాయిత్యానికి (Two Child Girls molested) ఒడిగట్టాడు.

Andhra Pradesh Shocker: మిద్దె మీదకు తీసుకువెళ్లి.. ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Chittoor, Sep 15: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు (Andhra Pradesh Shocker) అత్యాచారానికి పాల్పడ్డాడు. మిద్దె మీదకు తీసుకువెళ్లి కామాంధుడు ఇద్దరు చిన్నారులపై ఈ అఘాయిత్యానికి (Two Child Girls molested) ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మకాలనీలో నిన్నరాత్రి (మంగళవారం) ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అనిల్‌ కుమార్‌(21) అనే కీచకుడి కళ్లు వారిపై పడ్డాయి. దీంతో వారివద్దకు చేరుకుని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత వారిని మిద్దెపైకి తీసుకెళ్లి తొలుత 9 ఏళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మరో ఏడేళ్ల బాలికను తొడలమీద కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత 9 ఏళ్ల బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి చెప్పింది. దీంతో సావిత్రి వెంటనే మిద్దేమీదకు వెళ్లి చూడగా కీచకుడు తన అసభ్య ప్రవర్తను కొనసాగిస్తున్నాడు.

రౌడీగా మారిన కొడుకు..తట్టుకోలేక కర్రతో కొట్టి చంపేసిన తండ్రి, నెల్లూరు జిల్లాలో ఘటన, అనంతపురం జిల్లాలో ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ డాక్టర్

కాగా, వెంటనే సావిత్రి దిశయాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు కీచకుడు అనిల్‌ కుమార్‌ను అదుపులోకి (Accused arrested) తీసుకున్నారు. నిందితుడిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఆలస్యంగా వచ్చి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 15, 2021 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).