Andhra Pradesh Shocker: కత్తులు, బీరు బాటిళ్లతో వెంబడించి కానిస్టేబుల్ దారుణ హత్య, నంద్యాలలో నడిరోడ్డు మీద దారుణం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
constable surendra kumar (Photo-Video Grab)

Nandyal, August 8: ఏపీలోని నంద్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు.డీఎస్పీ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్‌ (37) (constable surendra kumar) విధులు ముగించుకొని ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌ థియేటర్‌ సమీపంలో ఆరుగురు పాతనేరస్తులు అడ్డగించి అటుగా వస్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కించుకుని చిన్నచెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సురేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి హత్య (Unknown Persons killed)చేసి వెళ్లిపోయారు.

దీంతో కొన ఊపిరితో ఉన్న సురేంద్రను ఆటో డ్రైవర్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విషయం తెలియజేశాడు. అక్కడ నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతదేహాన్ని ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. మూడో పట్టణ సీఐ మురళీమోహన్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా, దాడిలో పాల్గొన్న వారిపై కానిస్టేబుల్‌ గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తిరుపతి దర్శనానికి వెళుతూ అనంతలోకాలకు, అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి

నంద్యాలలో హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర మృతదేహానికి జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ హత్యకు పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటాని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

కాగా కానిస్టేబుల్ తిరుమల వెళ్లడానికి చినిగిన బ్యాగ్‌ను కుట్టించుకోడానికి టైలర్ షాపుకు వచ్చారు. ప్రక్కన టాటూ సెంటర్‌లో ఉన్న రౌడీ షీటర్లు, కానిస్టేబుల్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దుండగులు బీరు బాటిళ్లతో సురేంద్రపై దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ రోడ్డుపై పరుగుపెట్టారు. అయినప్పటికీ వదలకుండా దుండగులు వెంటాడి పట్టుకుని, ఆటోలో ఎక్కించి.. చెరువు కట్టవద్దకు తీసుకువెళ్లి కత్తులతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్‌ను హత్య చేసింది.. ముగ్గురు రైడీ షీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.