Amaravati, August 8: ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై (Amaravati-Anantapur National Highway) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో (Five dead as car hits lorry) ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు.
వీరంతా కారులో సిరిగిరిపాడు నుంచి మాచర్ల దారిలో తిరుపతిలో దైవ దర్శనం కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులను అమ్మిరెడ్డి(60), గురువమ్మ(60), అనంతమ్మ(55), ఆదిలక్ష‍్మి(58), నాగిరెడ్డి(24)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో విషాదకర ఘటన ఆదివారం చోటు చేసుకున్నది.ఆంజనేయులు అనే యువకుడు ఎస్‌ఐ పరీక్ష రాసి ద్విచక్ర వాహనం వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఆంజనేయులు తమ్ముడి పెళ్లి ఇవాళ ఉండడంతో పరీక్ష రాసిన అనంతరం.. ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన పెళ్లి ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.