TDP MLC Ashok Babu Arrested: టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్, తప్పుడు సర్టిఫికెట్ల కేసులో ఉద్యోగ సంఘాల మాజీ నేతను అదుపులోకి తీసుకున్న సీఐడీ, కక్ష సాధింపేనని మండిపడ్డ చంద్రబాబు

Vijayawada, Feb 11: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబును (MLC Ashok babu) ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల విషయంలో అశోక్‌బాబుపై(Ashok babu) ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఆయన ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ (CID) కార్యాలయానికి తరలించారు. అశోక్‌బాబుపై సెక్షన్ 477A, 465, 420 కింద కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో (Lokayuktha) ఫిర్యాదు చేశారు. అశోక్‌బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్‌ కమిషనర్ ఆఫ్‌ స్టేట్ టాక్స్‌ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Chandrababu Covid: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కరోనా పాజిటివ్, తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటన..

అశోక్‌బాబు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీఐడీ (CID)అధికారులు తెలిపారు. దీనిపై మరింత విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అశోక్‌బాబును అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఒక ప్రజాప్రతినిధిని రాత్రిపూట ఎలా అరెస్ట్ చేస్తారని టీడీపీ జాతీయాధ్యక్షుడు (TDP) చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి చర్యలకు తప్పక మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.