Vjy, Dec 11: ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారనే కారణాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొనలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఆర్కే రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది.
కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు, రాజకీయాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గానికి రూ. 1,250 కోట్ల నిధులను మంజురు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు నిధులను విడుదల చేయలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
వీడియో ఇదిగో, వాలంటీర్ కాళ్ళు కడిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
Here's Video
♦️మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా.
♦️ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి#YSRCP #Mangalagiri #AllaRamakrishnaReddy pic.twitter.com/pCRv4oQMda
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 11, 2023
టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి నియోజకవర్గంలో ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గంజి చిరంజీవికి జగన్ ఆప్కో ఛైర్మన్ పదవిని ఇచ్చారు. ఈ పదవి కేబినెట్ ర్యాంక్ తో సమానం కావడం గమనార్హం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కూడా చిరంజీవి పోటీ పడుతున్నారు. మరోవైపు, కాసేపట్లో ఆర్కే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.