Image used for representational purpose | (Photo Credits: Pixabay)

ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది. మొదట ఐర్లాండ్‌ నుంచి ముంబై వచ్చిన ప్రయాణికుడికి ముంబైలో టెస్ట్ చేయగా.. కోవిడ్‌ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో ముంబై నుంచి సదరు ప్రయాణికుడు విజయనగరం వెళ్లాడు. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అధికారులు అలెర్టయి… బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.