Vij, Jul 17: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయాల్లో ఆణివార ఆస్ధానం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ పరిధిలోని 450కి పైగా ఆలయాల్లో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంతో పాటు కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరుగగా పెద్దజీయర్ స్వామి,చినజీయర్ స్వామితో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు. గోవిందరాజస్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలను గోవిందరాజస్వామివారికి సమర్పించారు.
అలాగే కోదండరామాలయంలో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఆ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు టీటీడీ అధికారులు, అర్చకులు. ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం నుండి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు.బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది.
ఆణివార ఆస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆణిమాసం చివరి రోజు నిర్వహించే కొలువుకు ఆణివార ఆస్థానం అని పేరు. ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభం అవుతాయి.