
AP 10th Results 2022: ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9వరకు జరిగాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఫలితాలు జూన్ 4వ తేదీనే విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. చివరి నిమిషంలో వాయిదా వేశారు. సాంకేతిక కారణాలని అధికారులు చెబుతున్నప్పటికీ, మంత్రి బొత్స అందుబాటులో లేని కారణంగానే వాయిదా వేశారన్న విమర్శలు కూడా విన్పించాయి.
AP 10th Results 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
రేపు టెన్త్ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. కాగా సోమవారం (జూన్6) పదవ తరగతి ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ బి. రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.