Roja Tweet: నగరిలో ఓటమి దిశగా రోజా, ట్విట్టర్ లో చిరునవ్వులు చిందిస్తూ కొటేషన్ పోస్టు చేసిన ఫైర్ బ్రాండ్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (AP Assembly Election Result) కూటమి హవా కొనసాగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రులు ఇద్దరుముగ్గురు మినహా మిగిలినవారంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.
Vijayawada, June 04: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (AP Assembly Election Result) కూటమి హవా కొనసాగుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 150కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రులు ఇద్దరుముగ్గురు మినహా మిగిలినవారంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా (Roja) కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. అయితే, ఏపీలో కూటమి హవా కొనసాగుతున్న వేళ మంత్రి రోజా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. మంత్రి రోజా తన ట్విటర్ (Roja Tweet) ఖాతాలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు.
A powerful person is someone who converts:
❝
fears into confidence, setbacks into comebacks, excuses into decisions, mistakes into learnings.❜#QuoteOfTheDay pic.twitter.com/9SWkGN3KJD
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 4, 2024
భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారుతారు. అని రోజా ట్వీట్ లో పేర్కొన్నారు. రోజా ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 04, 2024 12:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

