Vijayawada, July 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన మాజీ సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత
వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద ఉన్న పోస్టర్లను లాక్కొని, చించివేసిన పోలీసులు..
పోలీసులపై సీరియస్ అయిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం pic.twitter.com/5N2kqyR8IZ
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2024
పోలీసులతో జగన్ వాగ్వివాదం
అంతకుముందు అసెంబ్లీ గేటు ముందు చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించారు. వీటిని లాక్కొన్న పోలీసులు వాటిని చించేశారు. పోలీసులపై సీరియస్ అయిన వైఎస్ జగన్.. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు.