AP Assembly Sessions 2023 (Photo-X)

Vijayawada, SEP 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) రసాభాసగా మారాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ (CBN Arrest) కు వ్యతిరేకంగా టీడీపీ (TDP Protest) ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. వెంటనే చర్చ ప్రారంభించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేపట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

AP Assembly Sessions: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో హట్‌ హాట్‌గా సాగనున్న సెషన్స్, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ అసెంబ్లీ 

టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యనే ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు స్పీకర్ తమ్మినేని. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ ఛైర్ వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు...సభా కార్యక్రమాలకు అడ్డపడ్డారు.