AP Assembly Sessions 2023 (Photo-X)

Vijayawada, SEP 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి.  మరోవైపు ఇవాళ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై శాసన సభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలన్న విషయాన్ని ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను శాసన సభలో బిల్లుల (Important Bills) రూపంలో ప్రవేశ పెట్టి చట్ట సవరణలు చేయనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశ పెట్టి చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP Cabinet Key Decisions: ఏపీలో ముందస్తు, జమిలి ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, విజయదశమి నుంచి విశాఖ నుంచే పాలన అని తెలిపిన ముఖ్యమంత్రి 

అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో (AP Assembly) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. అటు చంద్రబాబు అక్రమ అరెస్టుపై అధికార పార్టీని నిలదీయాలని టీడీపీ సభ్యులు కూడా రెడీగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో సభ సమరానికి అధికార, ప్రతి పక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఈ సమావేశాల్లో అధికార వైసీపీతో (YCP) అమీతుమీ తేల్చుకోవాలని టీడీపీ (TDP) డిసైడ్ అయింది. దీనికి దీటుగా జవాబు ఇచ్చేందుకు వైసీపీ కూడా రెడీగా ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.