YS Jagan (Photo-AP CMO)

VJY, Mar 24: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 9వ రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా..రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఒకటి బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని ఒక తీర్మానం.రెండవది దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని తీర్మానం. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌.

పాదయాత్రలో.. ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశాం. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ తెలుసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు.

ఆ నలుగురికి షాక్, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సీఎం జగన్, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధించినట్లు తెలిపిన సజ్జల

ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వారిని నేను కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటా. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండబోదని, గిట్టని వారే ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారాయన. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో తీర్మానం జరిగింది. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం. మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవని సీఎం జగన్ తెలిపారు.

వీడియో ఇదిగో, నేను వైసీపీకే ఓటు వేశానని తెలిపిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని వెల్లడించిన ఉదయగిరి ఎమ్మెల్యే

దీంతో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్‌, గ్రామ స్వరాజ్‌ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..

మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్‌లు

ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్‌లో నిధులు

రైతన్నల పక్షపాత బడ్జెట్‌

గ్రామ స్వరాజ్య బడ్జెట్‌

ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్‌ ద్వారా తెలియజేస్తున్నాం

సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్‌

ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం

వైఎస్సార్‌ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది

ఏప్రిల్‌ 5 వరకూ వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం

మేలో వైఎస్సార్‌ భరోసా, రైతు కిసాన్‌ కార్యక్రమం

మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లు, వైఎస్సార్‌ మత్యకార భరోసా

జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్‌ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు

జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత

జూలైలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం

జూలైలో వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత

ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర

సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత

అక్టోబర్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌

అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన

నవంబర్‌లో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత

నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత

డిసెంబర్‌లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత

డిసెంబర్‌లో జగనన్న చేదోడు

జనవరిలో వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌

జనవరిలో వైఎస్సార్‌ ఆసరా

జనవరిలో జగనన్న తోడు రెండో విడత

జనవరిలో వైఎస్సార్‌ లా నేస్తం రెండో విడత

జనవరిలో పెన్షన్‌ పెంపు(రూ. 3,000)

ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత

ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత

ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం

మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత

మార్చిలో ఎంఎస్‌ఎంఈ ప్రోత్సహకాలు