Srishailam, Nov 8: శ్రీశైలం (Srishailam) మహా క్షేత్రంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. ఇందులో భాగంగా రోప్ వే ఎంట్రీ , పాతాళ గంగ బోటింగ్, ఆలయ ప్రాంగణంతో పాటు పలు ప్రదేశాలను పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన.
బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో వెళ్లనున్న చంద్రబాబు.
స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్న చంద్రబాబు - చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు.#SrisailamTemple #ncbn @ncbn @JaiTDP
— Telangana Awaaz (@telanganaawaaz) November 8, 2024
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో పాటు ఏఎస్‌ఎల్ బృందం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)