Vijayawada, June 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి (Assembly) తిరిగి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడం, చంద్రబాబు భార్య ప్రస్తావనను తీసుకురావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆయన అప్పటి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించారు. కౌరవ సభలో తాను ఉండలేనని.. గౌరవ సభలోకి వస్తే సీఎంగానే తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో సీఎంగా మళ్లీ బాబు ప్రమాణం చేశారు. అప్పుడు శపథంలో పేర్కొన్నట్లుగానే తిరిగి ఇప్పుడు సీఎంగానే చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెడుగుపెట్టారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి ఆయన లోపలి వెళ్లారు.
అసెంబ్లీ మెట్లకు మొక్కిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Emotional At AP Assembly | ABN#cmchandrababu #apassembly #abntelugu pic.twitter.com/TtClAqmRSa
— ABN Telugu (@abntelugutv) June 21, 2024
విజయగర్వంతో..
తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో మట్టి కరిపించడమే కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసేసిన చంద్రబాబు ఇవాళ విజయగర్వంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గతంలో తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి దాదాపు రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయిన చంద్రబాబు.. ఇవాళ సీఎంగా తిరిగి అడుగుపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి