YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

Kurnool, March 29: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోల్పోయిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు (Hafiz Khan) ఏపీ సీఎం జగన్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన హఫీజ్‌ ఖాన్‌ను రాజ్యసభకు (Rajya Sabha Seat) పంపిస్తానని ప్రకటించారు. మేమంతా సిద్ధం పేరుతో ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహించిన సభలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (YS Jagan) ప్రసంగించారు. కర్నూలు నుంచి హఫీజ్‌ ఖాన్‌కు వైసీపీ నుంచి టికెట్‌ ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ఇదే హఫీజ్‌ను రెండేండ్ల తర్వాత వచ్చే రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారు.

 

తన మనసులో కల్మశం లేదు కాబట్టే ఇన్ని లక్షల మంది సమక్షంలో చెబుతున్నా అని అన్నారు. జగన్‌, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాను గమనించాలని ఈ సందర్భంగా సూచించారు.