Image used for representational purpose. | Photo Wikimedia Commons

Amaravati, Jan 3: ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) రైతులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్తను అందించింది. రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ కింద (YSR Rythu Bharosa-PM Kisan scheme) మూడోవిడత పెట్టుబడి సాయం‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం (YSR Rythu Bharosa) కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్‌ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూయజమానులు కాగా, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–దేవదాయ భూములు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు.

కీలక అంశాలే ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సాయంత్రం 4 గంటలకు భేటీ, రేపు హోం మంత్రితో భేటీ అయ్యే అవకాశం

భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్‌ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది.

మూడో విడతలో 48,86,361 మంది భూయజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది.

మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ ఆర్‌–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.