YSR Sunna Vaddi Scheme: రూ.128.47 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఏపీ సీఎం
AP Chief Minister YS Jagan inaugurated the Amul project (Photo-Video Grab)

Amaravati, April 20: ఏపీ ప్రభుత్వం రైతులకు మరో కానుకను అందించింది. రుణం తీసుకుని దాన్ని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద కట్టిన వడ్డీని నేరుగా వారి అకౌంట్లో జమ చేసింది. అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ (YSR Sunna Vaddi Scheme)అందించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని,

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్‌‌ తెలిపారు.

రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్లు జమ,ఈ ఏడాది 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ వర్తింపు, ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఏపీ ప్రభుత్వం

తొలుత ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే ఈ-క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌  ఈ పథకాన్ని వర్తింజేసి వారికి కూడా వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు.