AP Govt Employees Strike: నేడే సమ్మె నోటీసు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మెలోకి ఆర్టీసీ, వైద్య సిబ్బంది, PRC సాధన సమితి ప్రకటన..
File Pic

విజయవాడ, జనవరి 24:  కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. నేడు ఉద్యోగులు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు. మరోవైపు పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న నేపథ్యంలో నేడు కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేయనుంది. మరోవైపు పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని నుంచి పిలుపు వచ్చింది. చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించగా.. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలకు వెళ్లాలని స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది.

కరోనా విశ్వరూపం. దేశంలో గత 24 గంటల్లో 90,928 మందికి కరోనా, నిన్న క‌రోనా నుంచి 19,206 మంది కోలుకుని డిశ్చార్జ్

ఇక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు ప్రతి జిల్లాకు జేఏసీ తరపున ఓ రాష్ట్రస్థాయి నేతను పంపాలని నిర్ణయించారు. వీళ్లు జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై ప్రతి రోజు నివేదిక ఇస్తారు. PDF MLCలను కూడా కలుపుకొని ఉద్యమం ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. అలాగే విమర్శలను తిప్పికొట్టేందుకు..8 మందితో ఓ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.అయితే మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ స్టీరింగ్‌ కమిటీని ఆహ్వానించిన జీఏడీ కార్యదర్శి శశిభూషన్. మెజార్టీ సభ్యులు…చర్చల ప్రతిపాదనను వ్యతిరేకించారు..అటు ఉద్యమానికి మరింత మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది PRC సాధన సమితి.

మరోవైపు, సమ్మెలోకి ఆర్టీసీతోపాటు..హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇక 11వ పీఆర్సీ ప్రకారం పే రోల్ రెడీ చేసేది లేదని ట్రెజరీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీతాలు చెల్లించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. CFMS పోర్టల్‌లో ప్రత్యేక సాప్ట్‌వేర్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. బయోమెట్రిక్ మాడ్యూల్స్ తొలగించి.. అధికారుల సాయంతో కొత్త జీతాలు వేసేందుకు రెడీ అవుతోంది. CFMS సీఈవోకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించింది ప్రభుత్వం.