Amaravati, Feb 10: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి మృతి చెందిన వాలంటీర్ పిల్లా లలితకు (Palasa Volunteer) ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరణించిన వాలంటీర్ లలిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వాలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ (Covid vaccine) తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు.
ఏపీలో గత 24 గంటల్లో 26,844 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున గుర్తించారు.
వికటించిన వ్యాక్సిన్, శ్రీకాకుళం జిల్లా పలాస వాలంటీర్ మృతి, మరికొందరిలో దుష్ప్రభావాలు
అదే సమయంలో 115 మంది కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,88,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,478 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 917 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 7,160గా నమోదైంది.