All Bars License Cancelled In AP: ఏపీలో మద్యపానం నిషేధానికి మరో కీలక అడుగు, అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేసిన ఏపీ సీఎం జగన్, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ
Ap govt cancels the license of all the bars in the state (Photo-Twitter)

Amaravathi, November 22: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (Ap CM YS Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మద్యపాన నిషేధానికి బాటలు వేస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు రద్దు (All Bars License Cancelled In AP) చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (issued orders) జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఉన్నఫలంగా అమల్లోకి తీసుకొచ్చింది.

డిసెంబర్ 31, 2019 వరకు లైసెన్సుకు గడువు ఉన్నా.. బార్లను తెరవద్దని ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh govt) చెప్పింది. కొత్త బార్ల పాలసీ(New liquor policy)ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూయిస్తుండగా ఇప్పుడు రాష్ట్రంలో 40 శాతం బార్లు తగ్గించి మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం జగన్ సమీక్ష

బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీలో జనవరి 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీ అమలు(The new policy will be implemented in January) చేయనున్నారు.

కొత్త పాలసీలో ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త విధానం ప్రకారం రెండేళ్లకు లైసెన్సు ఇవ్వనుంది. రెండేళ్లకు లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ధారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేలా అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.

లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కొత్త లైసెన్సులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 798 బార్లు ఉండగా కొత్త పాలసీ అమలయ్యే నాటికి ఆ సంఖ్య 479కి చేరనుంది. కొత్త పాలసీ ప్రకారం లైసెన్స్ తీసుకునే యజమానులు లాటరీ ప్రాసెస్ ద్వారా రూ.10 లక్షల చెల్లించాల్సి ఉంటుంది.

కాగా 38 త్రీ స్టార్ హోటళ్లకు, నాలుగు మైక్రో బేవరేజ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. మద్యం ధరలను కూడా పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.