
Vijayawada, Feb 05: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (AP Employees Call Off Stir) ఆలోచనను విరమించుకున్నారు. మంత్రుల కమిటీతో (Ministers Committee) ఏపీ ఉద్యోగుల చర్చలు విజయవంతమయ్యాయి. మంత్రుల కమిటీతో రెండు రోజుల నుంచి సుధీర్ఘంగా సాగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు పీఆర్సీ సాధన సమితి (PRC JAC)నేతలు. మంత్రుల కమిటీతో అనేక డిమాండ్ల గురించి చర్చించామన్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం జగన్ (CM Jagan) అనేక ప్రయోజననాలు కల్పించారని, ఉద్యమం సమయంలో తాము చేసిన చిన్న చిన్న వ్యాఖ్యలను పట్టించుకోవద్దని నేతలు కోరారు. ఐదు డీఏలు (DA) ఒకేసారి ఇచ్చి తమకు మేలు చేశారని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.
మంత్రుల కమిటీ సమావేశంలో వేతన సవరణ విధానం మార్చాతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదిరిందని పీఆర్సీ (PRC) సాధన సమితి నేతలు తెలిపారు. సచివాలయంలో పని చేసే ఉద్యోగులందరికీ 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేందుకు ఒప్పుకోవడం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ తర్వాత కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని కోరామని, దీనిపై ప్రభుత్వం త్వరగా సానుకూంగా స్పందన వచ్చిందన్నారు. దీంతో సమ్మె చేయాల్సిన అవసరం లేదన్నారు. శనివారం నాడు దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది.