Amaravati, May 12: ఏపీలో విద్యుత్ బిల్లుల మోత (AP Electricity Bill) మోగుతుందంటూ ప్రతిపక్షలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనికి తోడు లాక్ డౌన్ (Lockdown) కారణంగా 60 రోజుల మీటర్ రీడింగ్ ఒక్కసారి తీయడంతో బిల్లు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా విద్యుత్ బిల్లు ఛార్జీలు పెంచారని ఆందోళన చెందుతున్నారు.
అయితే దీనిపై ఏపీ విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అదంతా అపోహేనని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి (Secretary of the Ministry of Energy Srikanth Nagulapalli) పేర్కొన్నారు. ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్
రెండు నెలలకూ కలిపి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి, ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులేనన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్ తీసినా... బిల్లింగ్ మాత్రం ఏ నెలకానెలే చేశామని ఆయన తెలిపారు. బిల్లింగ్ చేసిన విధానాన్ని ఆయన సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి 30 రోజులకోసారి తీసే మీటర్ రీడింగ్ లాక్‌డౌన్ కారణంగా 60 రోజులకు (మార్చి, ఏప్రిల్ వినియోగం) తీశాం. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఏపీఈఆర్‌సీ ప్రకటించిన కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చిలో 10న రీడింగ్ తీయడం వల్ల మిగిలిన 21 రోజులనే లెక్కలోకి తీసుకున్నాం. అంటే రీడింగ్ తీసిన 60 రోజులలో 21 రోజులు మార్చి నెలకు, మిగిలినవి ఏప్రిల్‌లోకి విభజించామని తెలిపారు. వైజాగ్‌లో ఒకరి నుంచి 20 మందికి కరోనా, కోలుకున్న కర్నూలు, ఏపీలో 2051కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 1056 మంది డిశ్చార్జ్
75 యూనిట్లలోపు వినియోగం (Electricity consumption) ఉంటే ఏ కేటగిరీలోనే ఉంటారు. 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బీ కేటగిరీ కిందే లెక్కిస్తారు. ఆ పైన వినియోగం ఉన్న వాళ్లే కేటగిరీ సీలోకి వెళ్తారు. 500 యూనిట్లుపైన వినియోగం ఉన్నవాళ్లకు మాత్రం ఈ ఏడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు. కాబట్టి తక్కువ వినియోగం ఉన్న వారికి ఎలాంటి అదనపు భారం పడే వీలే లేదని స్పష్టం చేశారు.
గత ఐదేళ్ల విద్యుత్ వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ప్రతీ ఏడాది మార్చి నెలలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈసారి లాక్‌డౌన్ వల్ల ప్రతీ ఒక్కరూ గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారాయి. అంతే తప్ప రెండు నెలల రీడింగ్ వల్ల ఏ మార్పూ రాలేదని ఆయన తెలిపారు.