Vijayawada, Oct 31: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ (TDP) అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్ తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్ గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
(టీవీ9 స్క్రోలింగ్) టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ముగిసిన వాదనలు - నేడు తీర్పు ప్రకటించనున్న ఏపీ హైకోర్టు - చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో వాదనలు ఎప్పుడనేదానిపై నేడు నిర్ణయం
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) October 31, 2023
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు
చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. ఏసీబీ కోర్టుకు ఎఫ్‌ఐఆర్ కాపీ అందింది.