Hyderabad, May 11: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం (AP Elections) నెలకొంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండటంతో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం సొంతూళ్లను వదిలి నగరానికి వచ్చిన ప్రజలు ఓటేసేందుకు ఊళ్లకు (Home Towns) బయల్దేరారు. ముఖ్యంగా ఏపీకి వెళ్తునన ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. దీంతో కొంతమంది ప్రజలు సొంత వాహనాల్లో ఏపీకి బయల్దేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ రహదారి వాహనాలతో నిండిపోయింది. టోల్‌గేట్ల (Toll Gates) దగ్గర వందలాది వాహనాలు బారులు తీరాయి.
Election Exodus from Hyderabad to AP
Voters of AP living in Hyderabad leaving the city for voting in General Elections. Hyderabad -Vijayawada highway witnessing huge traffic.
Political parties also organised free buses and cars for voters
Interestingly lakhs of them
have… pic.twitter.com/SvjPT3BLsc
— Sudhakar Udumula (@sudhakarudumula) May 11, 2024
ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కానీ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అవన్నీ నిండిపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక చాలామంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు టావెల్స్ రెచ్చిపోతున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీల మీద అదనంగా రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఏసీ బస్సుల్లో అయితే అదనంగా మూడు వేల వరకు వసూలు చేస్తున్నారు.