Anantapur, April 24: తాగుబోతు కొడుకు పెట్టే వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే కొడుకును హతమార్చిన విషాద ఘటన (drunkard son was brutally killed by his parents) అనంతపురం జిల్లా (Anantapur District) అమడగూరు మండలంలోని మద్దెమ్మగుడిపల్లిలో చోటు చేసుకుంది.
సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రామానికి చెందిన శివారెడ్డి, భాగ్యమ్మలకు కుమారుడు ప్రతాప్‌రెడ్డి, కూతురు శశికళ సంతానం. కాగా కుమార్తెకు వివాహం చేసి పంపారు. అయితే కుమారుడు ప్రతాప్‌రెడ్డి మాత్రం రోజూ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలోనే పదిహేను రోజులుగా కొత్త ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ప్రతాప్‌రెడ్డి గురువారం రాత్రి కూడా బైక్ కొనివ్వాలంటూ తల్లి భాగ్యమ్మపై చేయి చేసుకున్నాడు. గ్రామస్తుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
అయితే అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ప్రతాప్‌రెడ్డి మద్యం మత్తులో (drunkard son) తల్లిని మరోసారి కొట్టాడు. ఈ ఘటనను తట్టుకోలేని తండ్రి శివారెడ్డి తల్లి భాగ్యమ్మ ఇద్దరూ ఏకమై కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సోదరి శశికళ ఫిర్యాదు మేరకు సీఐ, ఎస్‌ఐ గ్రామానికి చేరుకుని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.