Hyderabad, April 20: ఆరేళ్ల బాలికపై అత్యాచారం (sexually assaulted) చేసిన వృద్ధునికి ఎల్‌బీనగర్ న్యాయ స్థానం 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించింది. వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కోప్రగది సంజయ్(58) ఎల్‌బీనగర్ ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉండేది. వారికి ట్విన్స్(6) ఆడపిల్లలు ఉన్నారు. 2017లో ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద బాలిక ఆగుకుంటు ఉండగా..చిన్నారిపై లైంగిక దాడికి (minor girl rape case) పాల్పడ్డాడు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సాక్ష్యాధారాలను సేకరించి నిందితునిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో ( rangareddy court) సమర్పించారు. ప్రత్యేక పోక్సో న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది.
సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి సురేష్ నిందితుడికి 14 ఏళ్ల కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించారు. అప్పటి ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి ఈ నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.