Representational Image (Photo Credits: PTI)

AP SSC Results 2022 LIVE: ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేస్తారని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది గ్రేడ్ల ద్వారా ఫలితాలు విడుదల చేయరు. కేవలం మార్కులను మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ SSC Results కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ టెన్త్ క్లాన్ పరీక్షలు నిర్వహించారు. కొంత ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని అనేక మంది ప్రభుత్వ టీచర్లు, ప్రయివేటు సంస్థల ఉద్యోగులపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.