Representational Image (File Photo)

AP రాజధాని విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ AP SSC టెన్త్‌ 2022-2023 ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో 933 పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ముందు స్థానంలో ఉండగా, లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. 75.38 శాతం మంది బాలికలు పాస్ కాగా, 69.27 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరగడం విశేషం.

AP SSC Results 2023 ఇక్కడ క్లిక్ చేయండి..

జూన్‌ 2 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు. అంతేకాదు విద్యార్థులకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్స్ కు, అత్యధిక శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు, ఆ స్కూల్ టీచర్స్ ను పోత్సహించే విధంగా ప్రణాళికలను ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్టూడెంట్స్ ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడవద్దని.. పరీక్షలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. విద్యా అకడమిక్ సంవత్సరం వేస్ట్ కాకుండా మళ్ళీ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.

ఇది మాత్రమేకాకుండా స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేసి కేవలం 18 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని మంత్రి బొత్సా చెప్పారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది. 933 స్కూల్స్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 33 శాతం స్కూల్స్ లో తక్కువ శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు.