 
                                                                  Representational Image (Photo Credits: PTI) 
                                                                 
                             
                                
                                                                     
AP TET 2022 Notification: ఆంధ్రప్రదేశ్ లో టెట్ నోటిషికేషన్ విడుదలయింది. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించవచ్చు. ఆగస్టు 6వ తేదీ నుంచి 21 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలను నిర్వహిస్తారు. అదే నెల 31వ తేదీన టెట్ కీ విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సెప్టంబరు 14వ తేదీన టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఎంతో కాలం నుంచి....
ఏపీలో ఎంతో కాలం నుంచి నిరుద్యోగులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు జరుగుతాయా? అని ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలకు http://aptet.apcfss.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని నిరుద్యోగులకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈరోజు సమాచారాన్ని ఈ వెబ్ సైట్ నుంచి సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించారు.