Vijayawada, OCT 14: తాను ఏం తప్పు చేశానని తనను అందరూ నిందించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun kumar) ప్రశ్నించారు. ఇది ఒక ప్రత్యేకమైన స్కామ్ అన్నారు. ఈ స్కాములో అంతర్జాతీయంగా పేరు ఉన్న సిమెన్స్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టై అప్ అయిందని తెలిపారు. సిమెన్స్ కంపెనీ తమకు ఏమీ తెలియదంటుందన్నారు. జీఎస్టీ విజిలెన్స్ పుణె వాళ్లు ఈ స్కామ్ ని పట్టుకున్నారని వెల్లడించారు. ఈరోజు దానికి సంబంధించిన ఫైల్స్ ఏమీ లేవు అంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు (Chandrababu) చేసిన పని తప్పని, ఆయన హయాంలో ఫైల్స్ మాయం చేశారా అని అడిగారు.
జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబును బుక్ చేద్దామని ఈ ఫైల్స్ మాయం చేశారా అని ప్రశ్నించారు. అవినీతి విషయంలో చంద్రబాబు మిగతా వాళ్లకంటే జాగ్రత్తగా ఉంటాడని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు. మోదీ, జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కలిసి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఏమీ ప్రూవ్ కాకపోవచ్చని తెలిపారు. చంద్రబాబుకి బెటర్ సౌకర్యాలు ఇవ్వాలని సూచించారు. జైల్లో ఏసీ పెట్టడం కుదరకపోతే ఆసుపత్రికి తరలించాలని వెల్లడించారు.