CM YS Jagan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్, ప‌గ‌లు వాళ్లతో...రాత్రి వీళ్ల‌తో ఉంటాడంటూ ఫైర్
CM Jagan Mohan Reddy (photo-X/YCP)

Vijayawada, May 10: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan Comments) ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు కుట్రతో మళ్లీ ఏపీకి వచ్చి పోటి చేస్తుందని విమర్శించారు. ఓట్లను చీల్చి ,వైసీపీని ఓడించి చంద్రబాబు (Chandra babu) ను గెలిపించడానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నుతుందని పరోక్షంగా చెల్లెలు షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. పగలు బీజేపీ(BJP) తో.. రాత్రి కాంగ్రెస్‌ (Congress) తో చంద్రబాబు సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్ర‌బాబు మ‌నిషేన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

Andhra Pradesh Elections 2024: జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వండి, ముద్రగడ పద్మనాభం లేఖ ఇదిగో..  

తన తండ్రి వైఎస్సార్‌ ఎవరితో యుద్ధం చేశారో వారితో వైఎస్సార్‌ వారసులమని చెప్పుకుంటున్న వారు చెట్టపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లేనని పేర్కొన్నారు. నాలుగుశాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన బీజేపీతో చంద్రబాబు జతకట్టారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు ఉండాలని మోదీకి చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.