VJY, Jan 11: కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలో (Ambedkar Konaseema district) సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో (Gollavilli under Amalapuram) భోగి మంటలు వేశారు.
విద్యార్థులంతా మంటల చుట్టూ చేరి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా.. సిబ్బంది పెట్రోల్ పోసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు విద్యార్థులకు వ్యాపించాయి. ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులు (Three children were injured) గాయపడ్డారు. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గాయపడిన విద్యార్థులను మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఘటనలో ద్వితీయ, మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు, యూకేజీ చదువుతున్న ఓ బాలుడు గాయపడ్డారు. ఇద్దరు విద్యార్థులకు కడుపు, కాళ్లకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. చలికాలం కావడంతో తల్లిదండ్రులు గాయాలు నయం అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, గాయాలు మానేందుకు సమయం పడుతుందని తెలిపారు.
సాధారణంగా సంక్రాంతి సందర్భంగా పాఠశాలల్లో ముగ్గుల పోటీలు, ఇతర పోటీలు నిర్వహిస్తారు. బోనాల వంటి కార్యక్రమాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. ఎంఈవో మాట్లాడుతూ విజ్‌డమ్ స్కూల్‌లోనూ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు వేయడం ఇదే తొలిసారి అని పాఠశాల డైరెక్టర్ రాంబాబు తెలిపారు. గాయపడిన పిల్లల ఖర్చులను తానే భరిస్తున్నట్లు వెల్లడించారు.