Anantapur, NOV 23: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు (RTC Bus Accident) ఢీ కొట్టడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
Bus Accident in Anantapur
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS గారు పరిశీలించారు#Anantapurpolice #APPOLICE100 pic.twitter.com/lUEqTcizr7
— Anantapur Police (@AnantapurPolice) November 23, 2024
కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు.. ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. రాంజమనమ్మ (48), బాల తాతయ్య (55) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో డి. నాగమ్మ, పెద నాగన్న ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ.. కొండమ్మ, జయరాముడు, చిననాగన్నలు మరణించారు. మిగతా క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలిని జిల్లా ఎస్పీ జగదీశ్, డీఎస్సీ వెంకటేశ్వరులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.