Vijayawada, OCT 05: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు (Skill Development Case) సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు (Chandrababu) రెండోసారి విధించిన రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే మరోసారి చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా? లేకపోతే బెయిల్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆయన బెయిల్ పై నిన్న కోర్టులో హోరా హోరీగా వాదనలు ముగిశాయి. తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేశారు. నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో బెయిల్ ఇస్తారా? లేకపోతే రిమాండ్ పొడిగిస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదటి రిమాండ్ ముగిసిన తర్వాత చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడు రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో జైలులోనే అధికారులు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్‌లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా అక్టోబరు 5 వరకు రిమాండ్ విధించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్...ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఆయన చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.