Chandrababu Naidu (Photo-Twitter)

కుప్పం, మే 14: కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కవరేజికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు.

దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై వృద్ధులు గ్యాంగ్ రేప్, రాత్రంతా రూంలో బంధించి అత్యాచారం, తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి

అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్‌ ‘సార్‌ ఇతను కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు శివను చూసి హెచ్చరికలు చేశారు. అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు.