విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ తెలిపింది. అరెస్ట్ విషయాన్ని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ ఎన్ సంజయ్ మీడియాకు వివరించారు.
‘‘ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు, స్కాంలో ప్రధాన సూత్రధారి, చివరకు లబ్ధిదారుడు కూడా చంద్రబాబు నాయుడే అని, ఆయనే ప్రధాన నిందితుడని విచారణలో తేలింది. స్కామ్‌కు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఆయనను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.
మరిన్ని విషయాలు సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ సొమ్ము అక్రమంగా ఎవరి ఖాతాలకు మళ్లించబడిందో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ పాత్రపై కూడా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కిలారు రాజేష్ పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలపై కూడా లోతుగా విచారణ జరుపుతాం.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారని, చంద్రబాబుకు అన్ని లావాదేవీలు తెలుసునని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన తర్వాత నిధుల మళ్లింపుపై ప్రశ్నిస్తామని ఆయన అన్నారు. కుంభకోణానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ధ్వంసమైనట్లు అధికారి తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జరిగిన స్కాములో స్పష్టమైన ఆధారాలతోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసాం
- సీఐడీ #CorruptionKingCBN #ScamsterChandrababu #SkillDevelopmentScam pic.twitter.com/qTdcOwv727
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) September 9, 2023
మరిన్ని విషయాలపై ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మాట్లాడుతూ.. 2014లో ఏపీ ఉన్నత విద్యా మండలి, సీమెన్స్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఎంఓయూ కుదిరిన తర్వాత అదే ఏడాది జూలైలో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. గంటా సుబ్బారావు దీనికి సీఈవోగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు సీఈవో, ఎండీ, ఉన్నత విద్యా మండలి సలహాదారు, ముఖ్యమంత్రి సలహాదారు పోస్టులు ఉన్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.371 కోట్లు పెట్టుబడి పెట్టినా సీమెన్స్ ప్రాజెక్టుపై ఎలాంటి నిధులు ఖర్చుచేయలేదు. దీనిపై ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో ప్రధాన కార్యదర్శిని కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు.