Vijayawada, June 12: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటల 41 నిమిషాలకు సీఎం చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక చంద్రబాబు తొలి సంతకం (Chandrababu Naidu First Sign) దేనిపైన అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కాగా, మెగా డీఎస్సీ (Mega DSC) ఫైల్ పైనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు అని తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ రూ.4వేలకు పెంపు ఫైల్ పై మూడో సంతకం, స్కిల్ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. సచివాలయానికి వెళ్లేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టొచ్చని భావించారు. కానీ, రేపు మంచి రోజు కావడంతో సాయంత్రం 4గంటల 41 నిమిషాలకు చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్ లో ఆసీనులు అవబోతున్నారు. ఆ వెంటనే పరిపాలనను పరుగులు పెట్టించనున్నారు. ఉద్యోగ సంఘాలు, రాజధాని రైతులు.. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. రేపటి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు.