బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. మేదరమెట్లలో కనిపిస్తోంది ఓ జన సముద్రం.. ఓ జన ప్రవాహం కనిపిస్తోంది. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా? అని సీఎం జగన్ అనగానే.. లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు.
#WATCH | Andhra Pradesh CM YS Jagan Mohan Reddy addresses a public meeting in Bapatla, Andhra Pradesh. pic.twitter.com/tw4NHOcHCp
— ANI (@ANI) March 10, 2024
సీఎం జగన్ ప్రసంగంలో హైలైట్స్ ఇవే..
>> బిందువు, బిందువు సింధువు అయినట్లుగా, నా మీద, పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధం అంటూ, ఉప్పెనలా తరలివచ్చిన అభిమానం ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే కనిపిస్తోంది
>> ఇక్కడ కనిపిస్తోంది జన సముద్రం.. జన ప్రవాహం
>> మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా
>> పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?
>> జగన్‌ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం
>> మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...?
>> సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం.. సిద్ధమంటే ప్రజాసముద్రం
> ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం
.@ncbn ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు.@PawanKalyan చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాడు.
సైకిల్ దిగి ఎప్పుడు తొయ్యమంటే అప్పుడు తోస్తాడు దత్తపుత్రుడు.
-సీఎం @ysjagan #Siddham#MosagaduBabu#PackageStarPK pic.twitter.com/Oo8gRnv0JC
— YSR Congress Party (@YSRCParty) March 10, 2024
>> ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం
>> ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది.. అర్జునుడి పాత్ర నాది
>> జమ్మిచెట్టుపై ఇన్నాళ్లు దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందార్లుపై ప్రయోగించాలి
>> చంద్రబాబులా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు లేరు
>> అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు
>> పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా మనం తలపడుతున్నాం
>> ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు
కార్యకర్తలని నీలాగ చూసుకునే నాయకుడు లేడు @ysjagan అన్న. 🥹🙏🏻#Siddham#WhyNot175#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/fiS6OgzyVY
— YSR Congress Party (@YSRCParty) March 10, 2024
>> నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్
>> మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి
>> చంద్రబాబు జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ
>> నాకు చంద్రబాబు మాదిరిగా నటించే పొలిటికల్ స్టార్లు పదిమంది లేరు.
>> నాకు చంద్రబాబు మాదిరిగా ఓ ఈనాడు లేదు.. ఆంధ్రజ్యోతి లేదు. టీవీ5 లేదు
>> అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు.
>> రకరకాల పార్టీలతో పొత్తులూ లేవు మీ బిడ్డకు
>> ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఉన్నన్ని పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ప్రతిగడపలోనూ ఉన్నారు.
>> నా ఎదుట ఇసుకవేస్తే రాలనంతగా ఈ రోజు అభిమానులు, ఈ ప్రజానీకం ప్రతి ఒక్కరూ మీ జగన్‌కు అండగా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు నడిపేందుకు నడుం బిగించాలి.
>> జగన్ అంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
>> మనతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు
>> మన ఎమ్మెల్యేలు అంతా గడపగడపకూ తిరుగుతున్నారు
>> చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు తిరుగుతున్నారు
>> ఇంటింటికి జగన్ చేసిన అభివ1ద్ధి చూసి చంద్రబాబుకు భయం వేస్తోంది
>> మీ బిడ్డ పాలనలో ప్రతీ ఇంట్లో చిరునవ్వు కనిపిస్తోంది
>> ప్రజలు ఆశీర్వదిస్తేనే మన పార్టీకి కరెంట్ వస్తుంది
>> చంద్రబాబు ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు
>> ప్యాకేజ్ స్టార్‌సైకిల్ సీటు తనకు కావాలని అడగడు
>> ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు ఇచ్చావని అడగడు
>> దత్తపుత్రుడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాడు
>> సైకిల్ దిగి ఎప్పుడు తొయ్యమంటే అప్పుడు తోస్తాడు
>> ఎప్పుడు కావాలంటే అప్పుడు పొత్తు పెట్టుకుంటాడు.. విడిపోతాడు