Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy (Photo Credit: ANI)

Vijayawada, June 28: ఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం (amma vodi scheme) కు సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) బటన్ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) కురుపాంలో బుధవారం జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇదిలాఉంటే నిన్నటితో KYC పూర్తయిన వారి అకౌంట్లలో డబ్బులు వేయనుండగా.. ఏదైనా సాంకేతిక కారణాలతో జూన్ 28 తర్వాత KYC చేసుకున్నవారికి జులై మొదటి వారంలో జరిగే వారోత్సవాల్లో నగదు జమ అవుతుంది.

Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు 

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి అమ్మఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లు జమ చేయనున్నారు. బుధవారం అందజేసే నగదుతో కలిపితే ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి ద్వారా రూ. 26,067.28 కోట్లు మేర విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లవుతుంది.

AP Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానివ్వను, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని తెలిపిన పవన్ కళ్యాణ్ 

ఏపీ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన సీఎం జగన్.. నాలుగేళ్లలో విద్యారంగంపై రూ. 66,722.36 కోట్లను వెచ్చించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.