CM YS Jagan Siddham Meeting In Raptadu: సీఎం జగన్‌ కొత్త హామీలపై సర్వత్రా ఆసక్తి...రాప్తాడు సిద్ధం సభకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు..లక్షల్లో తరలివస్తున్న జనం..
YS Jagan (Photo-Video Grab)

రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభ­లకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ కైవసం చేసుకునే దిశగా వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి నేడు జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభకు రాప్తాడులో సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చకచకా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వైయ‌స్ఆర్‌, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ కేడర్‌, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. వీరందరికీ అవసరమైన తాగునీరు, వైద్యం తదితర సదుపాయాలు కల్పిస్తున్నారు.

‘సిద్ధం’ బహిరంగ సభా వేదిక నిర్మాణం తుది దశకు చేరుకుంది. వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ ఆకారంలో భారీ వాక్‌ వే రూపుదిద్దుకుంది. సభలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన అనంతరం ‘వాక్‌ వే’ ద్వారా పార్టీ కేడర్‌ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెనుక భాగంలో హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 25కి పైగా పార్కింగ్‌ ప్రాంతాలు గుర్తించారు.

Ysrcp 7th List: ఏడో జాబితా విడుద‌ల చేసిన వైసీపీ,

రాప్తాడు ఆటోనగర్‌ సమీపంలో ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. రాప్తాడు, అనంతపురం, ధర్మవరం ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డితో కలిసి నేడు పరిశీలించారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పూర్తిస్థాయిలో హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయిస్తున్నారు.