CM Jagan Mohan Reddy (Photo/AP CMO)

Vijayawada, FEB 17: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ (YCP List) వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్ లను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు జగన్ (YS Jagan). తాజాగా 7వ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్. 7వ జాబితాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది వైసీపీ. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎడం బాలాజీ, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కటారి అరవింద యాదవ్ లను నియమించింది వైసీపీ అగ్రనాయకత్వం. ఇప్పటివరకు ఆరు జాబితాలు విడుదల చేసింది వైసీపీ అగ్రనాయకత్వం. అందులో అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగ్ లకు టికెట్ల నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు.

AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం 

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ (Amanchi krishna mohan) ఉన్నారు. ఈ ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల (Chirala) నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ ని ప్రకటించింది వైసీపీ హైకమాండ్. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను కలిసి పర్చూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇంచార్జిగా నియమించారు జగన్. కందుకూరు.. చాలారోజులుగా ఈ స్థానానికి మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జరిగింది. ప్రస్తుతం కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహిధర్ రెడ్డి ఉన్నారు. ఈసారి సీఎం జగన్ ఆయనను తప్పించారు. మహిధర్ రెడ్డి స్థానంలో కటారి అరవిందా యాదవ్ కు అవకాశం ఇచ్చారు.