
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 1 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలి లో మెయిన్ రోడ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్ లో జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.