Megastar Chiranjeevi | Photo - Twitter

Amarawathi, SEP 21: నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన ట్వీట్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ, రాజకీయవర్గాల్లో చిరు డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై (Political reentry) డిబేట్ కు దారితీసింది. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ.. చిరంజీవి ట్వీట్ (Chiru Tweet) చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల చేయడం చర్చకు దారితీసింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్స్ (PCC Deligates) జాబితా ఆసక్తిని రేపుతోంది. చాలాకాలంగా రాజకీయాలకు, కాంగ్రెస్ కు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Chiranjeevi Political Dialogue: చిరంజీవి అలా ఎందుకు ట్వీట్ చేశాడు, ఒక్క డైలాగ్‌తో అతని రాజకీయ రీఎంట్రీపై వైరల్ అవుతున్న వార్తలు 

అంతేకాదు.. ఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసింది. కొవ్వూరు నుంచి పీసీసీ డెలిగేట్ గా చిరంజీవి పేరుని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. 2027 అక్టోబర్ వరకు వర్తించేలా ఐడీ కార్డ్ జారీ (ID Card) చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ జారీ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. త్వరలోనే జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఐడీ కార్డును విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే.

AP Assembly Sessions 2022: ఎన్టీఆర్‌ పేరు మార్చడంపై నన్ను నేను ప్రశ్నించుకున్నా, బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం అసెంబ్లీలో సీఎం జగన్ 

అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకే కాదు రాజకీయాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. చాలా కాలంగా పాలిటిక్స్ కు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి.. పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు సంబంధించి నిన్న ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరంజీవి. ఇంతలోనే చిరంజీవికి ఈ పదవి దక్కడం విశేషం. మరి, చిరంజీవి ఆ పదవిని స్వీకరిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.