2024 భారతదేశం ఎన్నికలు:  ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్ధులు ఖరారు, ఏయే స్థానాల్లో ఎవ‌రు పోటీ చేస్తున్నారంటే?
Congress Flag (Photo-X/Congress)

Vijayawada, April 21: ఏపీలో మరో 9 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ (Congress List) అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేయనున్నారు. విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను పోటీ చేస్తారు. కాగా, ఇవాళ ఝార్ఖండ్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరి పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. మిగతా అభ్యర్థులను ఆ పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. ఏపీలో ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.

 

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం - పి.పరమేశ్వరరావు

విజయనగరం - బొబ్బిలి శ్రీను

అమలాపురం - జంగా గౌతమ్‌

మచిలీపట్నం - గొల్లు కృష్ణ

విజయవాడ - వల్లూరు భార్గవ్‌

ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి

నంద్యాల - జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌

అనంతపురం - మల్లికార్జున్‌ వజ్జల

హిందూపురం - బీఏ సమద్‌ షహీన్‌