Cyclone Bulbul intensifies into very severe cyclonic storm; to hit Odisha, Bengal with heavy rains (Photo Credits: PTI)

New Delhi, May 15: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్‌గా (Cyclone Amphan) మారనున్నది. తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌ (Cyclonic Storm) మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఏపీకి తుఫాను ముప్పు, వాయుగుండంగా మారుతోన్న అల్పపీడనం

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, బెంగాల్ బే మరియు అండమాన్ సముద్రం మీదుగా భారత తీరప్రాంతానికి IMD తుఫాను హెచ్చరికను ప్రకటించింది. మే 18 నుంచి మత్స్యకారులు ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లోకి వెళ్లవద్దని, సముద్రంలో ఉన్నవారు వెంటనే తిరిగి తీరానికి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే రేపు కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం ( Indian Meteorological Department (IMD) హెచ్చరించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రేపటికి దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండం కాస్తా అంఫాన్ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 17 వరకు వాయువ్య దిశగా తుపాను పయనించి, అనంతరం రికర్వ్ తీసుకుని ఈ నెల 18, 19 తేదీల వరకు ఉత్తర, ఈశాన్య దిశగా పయనించనుందని తెలిపింది. రైతుల అకౌంట్లోకి నేరుగా రూ.7,500, నేడు సీఎం చేతుల మీదుగా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమ

ఈనెల 17న 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని, 18న ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈ తుఫాన్‌కు 'అంఫాన్'గా నామకరణం చేశారు. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో 15వ తేదీన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం, 16న భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 15న రాయలసీమలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, 16న ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు అంఫాన్ తుఫానుకు గురయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెదర్ గురువారం తెలిపింది. మే 17 మరియు 20 మధ్య సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయని పేర్కొంది.